సమయము కుదరక ఈ బ్లాగును కొనసాగించలేక పోతున్నందుకు క్షంతవ్యుడను... మీ ప్రతాప్

ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః | 

గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః|| 

 

"నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి అయినా ఆదియుగం నుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి. జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు. సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడే... ఉపాధ్యాయుడు, సృష్టి స్థితి లయల నిర్దేశకుడు! అలాంటి మహోన్నత మహాఋషికి నేటి సమాజంలో అడుగడుగునా ఆటంకాలే... వెటకారాలు,  వెండతెరపై ఆటపట్టింపులు... విద్యార్ధులు చేసే అనాలోచిత చర్యలకు భాధ్యులు..ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా... బుద్ధినే సిమెంటుగా, జ్ఞానాన్నే ఇటుకలుగా, వివేకాన్నే కాంక్రీటుగా మలిచి విజ్ఞానమనే భవంతుల్ని నిర్మిస్తున్న నిత్య శ్రామికులు, నిత్యాన్వేషులు, నిత్య విద్యార్ధులుగా జ్ఞాన కుసుమాలు పూయిస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారములు" 

 

నా గురించి చెప్పటం ప్రస్థుతాంశంకాదు. నేను Subject లో నిష్ణాతుడిని ఖచ్చితంగా కాదు. పైన ఇచ్చిన పదాలు సైతం నా స్వంతం కాదు. కానీ టెక్నాలజీ పట్ల కాస్త మక్కువ ఎక్కువ. ఈ నేపధ్యంలో ఒక సంవత్సరం క్రితం "LEARN ENGLISH" పేరుతో ఒక బ్లాగు క్రియేట్ చేసి నాకు తెలిసిన 4 మాటలు వ్రాసాను. అవి 4గురికి ఉపయోగపడుతున్నాయని తెలిసి దానిని కొనసాగించాను. ఈ రోజున ప్రతి పాఠశాలలో నెట్ సౌకర్యం ఉన్నందున ఖాళీ సమయంలో విధ్యార్ధులు ఉపయోగించుకుంటారని "10th Class" అనే లేబుల్ క్రింద వారికి పనికొచ్చే విషయాలను కొన్ని సేకరించి వుంచాను.కానీ కొందరు ఉపాధ్యాయ మిత్రులు వాటిని సెర్చ్ చేయడం మాకు కొంచం ఖష్టం గా వుంటుందని .. అవి కొంచం క్లియర్ గా వుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు కేవలం పదవ తరగతి విధ్యార్డులకు మాత్రమే పనికొచ్చేలా ఈ బ్లాగు క్రియేట్ చేశాను. కానీ దీనిలో ప్రతి విషయాన్ని స్పృశియించడం నాకు కొంచం ఖష్టమైన పని.  ఇందుకు మీ స్నేహ హస్తం రెండు విషయాలలో కావాలి. 

 

1) ఏ ఒక్కరూ అన్ని విషయాలలో నిష్ణాతులు కారు. ఈ బ్లాగు నిర్మాణంలో, వెలువరించిన Lessons లో ఎన్నో తప్పులు దొర్లి వుండవచ్చు. వాటిని మీరు సహృదయంతో తెలియజేయగలరు. వెనువెంటనే అది సరి చేయబడుతుంది. 

2) మీరు మిగతా lessons కి సంభంధించిన నోట్స్ గాని, విధ్యార్ధులు తేలికగా అర్ధం చేసుకునేందుకు వారి స్థాయికి దిగి, అవసరమైన చోట తెలుగు వివరణతో   మీరు చేసిన ప్రయత్నాన్ని గాని నాకు మెయిల్ చేయండి. అది మీ పేరుతోనే పబ్లిష్ చేయబడుతుంది.

 

కృతజ్ఞతలు

మీ వి.వి.ప్రతాప్